'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్' పై వర్మ కౌంటర్..
- September 26, 2019
రామ్ గోపాల్ వర్మ అంటే వివాదం.. వివాదం అంటే రామ్ గోపాల్ వర్మ. తను మాట్లాడితే సెన్షేషన్ అవుతుందో.. లేక మీడియా, సామాజిక మాధ్యమాలు సెన్షేషన్ క్రియేట్ చేస్తాయో తెలీదు కానీ వర్మ మాత్రం ఎప్పటికీ హాట్ టాపిక్కే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వర్మ మాటల్లో కొందరికి నిజం కనిసిస్తే మరికొందరికి శాడిజం కనిపిస్తుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయని వర్మ.. ఇండియన్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
'దాదా సాహెబ్ ఫాల్కే గురించి నాకు సరైన ఐడియా లేదు. ఎందుకంటే.. ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమా నేను 10 నిముషాల కంటే ఎక్కువసేపు చూడలేకపోయాను. అందులో 10 రకాలుగా సినిమా చూపారు. కానీ, మీరు చేసిన 10 రకాల సినిమాలను నేను అంతకంటే ఎక్కువ సార్లు చూసాను. కాబట్టి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ మీకు ఇచ్చే బదులు.. 'అమితాబ్' అవార్డునే పెట్టి దాదా కు ఇస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఈ అవార్డును తీసుకున్న వారికి మీ అంత ఫైర్ లేదు. కాబట్టి నాకు ఈ అవార్డు మీద అంత ఆసక్తి లేదు. నిజానికి ఈ అవార్డులు ఇచ్చే కమిటీ వాళ్ళు మీ సినిమాలేవీ సరిగా చూడలేదని నా అభిప్రాయం' అంటూ నిర్మొహమాటంగా తన ఉద్దేశాన్ని ఇన్ స్టాగ్రామ్ లో చెప్పేసాడు.
వర్మ మాట్లాడితే ఇలానే ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. ఈ అవార్డుపై వర్మ కామెంట్ చూసిన వాళ్ళు.. వర్మ ఇలా కామెంట్ పెట్టకపోతే వర్మలో స్పెషాలిటీ ఏముంటుంది అనుకుంటున్నారు. అమితాబ్ తో మూడు సినిమాలు తీసాడు వర్మ. సర్కార్ తో అమితాబ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాడు.. ఆగ్ సినిమాతో అంతే చెడగొట్టాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!