రూ.186 కోట్లకు మోసం చేసినట్లు సుభాస్కరన్ పై ఆరోపణలు
- September 26, 2019
'లైకా' ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'కత్తి', '2.0' లాంటి భారీ సినిమాలను రూపొందించిన ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రూ.186 కోట్లకు మోసం చేసినట్లు సుభాస్కరన్ పై ఆరోపణలు చేస్తున్నారు. చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు బాధితులు.
బిజినెస్ మెన్ గా సక్సెస్ అయిన సుభాస్కరన్ సినిమాల మీద ఆసక్తిగా నిర్మాతగా మారి అతడి తక్కువ సమయంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా లైకా ప్రొడక్షన్ సంస్థకి పేరు తీసుకొచ్చాడు. ఈ బ్యానర్ లో వచ్చిన '2.0' సినిమా కోసం అతడు భారీ పెట్టుబడి పెట్టాడు.
దాదాపు 500 కోట్లకు పైగా ఈ సినిమాపై వెచ్చించాడు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. ఇటీవల సినిమాను చైనాలో విడుదల చేశారు. అక్కడ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో సుభాస్కరన్ కి నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతడు తీసుకున్న బకాయిలు చెల్లించలేకపోయాడు. దీంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!