వేణుమాధవ్ అంత్యక్రియలకు హాజరైన మేయర్ రామ్మోహన్
- September 26, 2019
హైదరాబాద్:తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో సహా పలువురు కార్పొరేటర్లు నేడు హాజరయ్యారు. మౌలాలిలోని వేణుమాధవ్ గృహంలో ముందుగా ఆయన పార్థివ దేహానికి మేయర్ రామ్మోహన్ పూలమాలతో నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఈ అంత్యక్రియల సందర్భంగా వేణుమాధవ్ నివాసం నుండి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా సన్నిహితులైన వేణుమాధవ్ మరణించడం తెలంగాణతో పాటు మొత్తం తెలుగు ప్రజానికం మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు. సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను, గుర్తింపు పొందిన వేణుమాధవ్ అతిపిన్న వయసులోనే మరణించడం బాధకరమని అన్నారు.
.................................................................................................................
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!