ఎర్రగా మారిన రస్ అల్ ఖైమా కోస్ట్ వాటర్స్
- October 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఫిషర్మెన్, ఎమిరేట్ కోస్ట్ నుంచి 12 మైళ్ళ మేర రెడ్ వాటర్ కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ, ఈ వ్యవహారంపై స్పందించి వివరణ ఇచ్చింది. రెడ్ ప్యాచెస్‌తో ఎలాంటి మెరైన్ లైఫ్ మీద ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ వుండదని స్పష్టం చేసింది. ఏడాదిలో రెండుసార్లు రెడ్ టైడ్ ఫినోమినన్ కన్పిస్తుందనీ, దీని వల్ల మెరైన్ ఎన్విరాన్మెంట్కి వచ్చిన నష్టమేమీ లేదని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ స్పష్టం చేసింది. 'అల్గే బ్లూమ్స్'గా కూడా ఈ రెడ్ టైడ్‌ని పిలుస్తారు. 2008లో తొలిసారిగా యూఏఈ రిజినల్ వాటర్స్‌లో దీన్ని గుర్తించారు. కాగా, రస్ అల్ ఖైమా కోస్ట్‌లో ఈ పరిస్థితిపై అప్రమత్తమయిన యూఏఈ యంత్రాంగం, ఆ ప్రాంతం నుంచి శాంపిల్స్‌ని సేకరించి, పరీక్షలు నిర్వహించనుంది. ఓ రకమైన బ్యాక్టీరియా కారణంగా ఇది జరుగుతుటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రస్ అల్ ఖైమా, డాక్టర్ సైఫ్ అల్ ఘాయిస్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..