డిసెంబర్‌ నుంచి అబుదాబీలో స్మార్ట్‌ డ్రైవింగ్‌ పరీక్షలు

- October 07, 2019 , by Maagulf
డిసెంబర్‌ నుంచి అబుదాబీలో స్మార్ట్‌ డ్రైవింగ్‌ పరీక్షలు

అబుధాబి: స్మార్ట్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ సిస్టమ్‌ డిసెంబర్‌ నుంచి అబుధాబిలో అందుబాటులోకి రానుంది. లైసెన్స్‌ ప్రక్రియకు సంబంధించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు. డ్రైవర్‌ పరీక్షకు సంబంధించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు టెక్నాలజీస్‌ ద్వారా పరిస్థితిని అంచనా వేసి, ఫలితాన్ని నిర్ధారించడం జరుగుతుంది. మార్జిన్‌ ఆఫ్‌ ఎర్రర్‌ని 'జీరో'గా చేసి, ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వడమే ఈ టెక్నాలజీ ఉద్దేశ్యమని అధికారులు పేర్కొన్నారు. కారులోని పలు ప్రాంతాల్లో సెన్సార్లను అమర్చుతారు. ఆ సెన్సార్లు డ్రైవింగ్‌ పరీక్షని ఖచ్చితంగా నిర్ధారిస్తాయి. అబుధాబిలో 18 స్మార్ట్‌ కార్లు, అల్‌ అయిన్‌లో 10, అల్‌ దఫ్రాలో 8 స్మార్ట్‌ కార్లతో ఈ స్మార్ట్‌ టెస్ట్‌కి శ్రీకారం చుడతారు. చిన్న చిన్న పొరపాట్లను కూడా కంట్రోల్‌ రూమ్‌ క్యాచ్‌ చేసేలా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రమాదాల్ని నివారించే క్రమంలో డ్రైవర్‌ సమర్థత కీలకమనీ, అత్యంత సమర్థత కలిగిన డ్రైవర్లకు మాత్రమే లైసెన్స్‌ ఇచ్చేందుకు ఈ స్మార్ట్‌ విధానం ఉపయోగపడ్తుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com