తెలంగాణ జాగృతి ఖతర్ జానపద బతుకమ్మ
- October 07, 2019
దోహా:తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపదాల ఔన్నత్యాన్ని తెలుపుతూ జానపద బతుకమ్మ నిర్వహించడం జరిగింది.ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ మరియు అష్ట గంగాధర్ అతిధులుగా హజరై పాత కొత్త జానపదాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు AP మణికంఠణ్, ICBF అధ్యక్షుడు బాబు రాజన్ మరియు ఎంబసీ అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఖతర్ లో ప్రముఖ విద్యావేత్త, కె.యస్ ప్రసాద్ తో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురికి మెమెంటోతో సత్కరించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షులు నందిని అబ్బగౌని మాట్లడుతూ గత సంవత్సరం చేనేత కు చేయుతనిస్తూ చేనేత బతుకమ్మ చేసామని, ఈ యేడు మన జానపద ఔన్నత్యాన్ని, కళలను వాటి గొప్పతనాన్ని ప్రపంచానికీ చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో చేసిన జానపద బతుకమ్మ కు విశేష స్పందన వచ్చిందని దాదాపు 450 మందికి పైగా ప్రవాసులు హజరై లయబద్దంగా, సాంప్రదాయ పరంగా , డీజే చప్పుల్లతో కాకుండా అసలైన బతుకమ్మ పాటలతో, జానపదాలతో
బతుకమ్మ ఆడారని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న మాట్లాడుతూ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు
కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా కార్మికులకు, ఉద్యోగులకు నైపుణ్య అభివృద్ధి శిబిరాలు, మహిళలకు సాంప్రదాయ వంటల పోటీలు, మహిళా సాధికారత సెమినార్లు వంటి సామాజిక కార్యక్రమాలే కాకుండా గల్ఫ్ కార్మికులకు అండ దండగా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..