ఏ.పి సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు
- October 14, 2019
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి... భార్య సురేఖతో కలిసి.. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..