311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో!
- October 18, 2019
వాషింగ్టన్: ట్రంప్ విదేశీవిధానం వల్ల ఎన్నారైలు పలు ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశీయులకే ఉపాధి అవకాశాలు అని, ఎన్నారైలలో అత్యంత ప్రతిభావంతులకే చోటు అంటూ చెబుతున్న ట్రంప్ తన విదేశీవిధానంలో మార్పు చేయడం లేదు. దీంతో ఎలాగైనా అమెరికాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కొందని ఆశను ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా..అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో ప్రభుత్వం. అంతార్జాతీయ ఎజెంట్ల ద్వారా భారతీయులు అక్రమంగా అమెరికా వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరూ 25-30 లక్షలు చెల్లిస్తున్నారు. వారం రోజుల నుండి నెలరోజుల లోపు అమెరికాకు పంపించిటానికి ఎజెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి బోజనం, వసతి, విమాన టికెట్ల సౌకర్యాలు ఎజేంట్లే కల్పించారు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ద్వారా వారిని భారత్ నుండి మెక్సికో చేర్చారు. ఇలా 311 మందిని అక్రమంగా మెక్సికోలో ఉంచారు. అయితే తాజాగా వీరికి ఎస్కార్టులుగా 60 మందిని విమానంలో పంపుతుండగా మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనఖీలో పట్టుకున్నారు. వీరిలో అందరూ పురుషులుగా ఉండగా ఒకరు మాత్రం మహిళా ఉన్నారు. వీరంతా పంజాబుకు చెందిన వారుగా గుర్తించారు. దీనివలన భారత్‌కు చెడ్డ పేరు వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..