దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం
- October 20, 2019
దుబాయ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళా దైవసేవకురాలు గుండెపోటు తో హఠాన్మరణం చెందిన సంఘటన ఇటీవల జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం యలమంచిలి కి చెందిన మధుర సత్యావతి శుక్రవారం తన భర్త వినయ భూషణం తో కలిసి విజిట్ వీసా లో దుబాయ్ కి వచ్చారు. మంగళవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ దుబాయ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మార్గమధ్యంలో మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. అయితే సాధారణంగా మృతదేహాన్ని ఇండియా కి తరలించడం చాల క్లిష్టమైన ప్రక్రియ. దుబాయ్ చట్టాల ప్రకారం అనేక లాంఛనాలు ఉంటాయి. అయితే ఇక్కడి తెలుగు న్యాయవాది షాలేంబాబు చొరవతీసుకుని చాకచక్యంగా అన్ని లాంఛనాలు త్వరితగతిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిచేయడంతో ఆమె పార్ధివదేహాన్ని విమానంలో ఇండియా కి తరలించారు.
మధుర సత్యావతి దైవ సేవకురాలిగాను ఆమె భర్త పాస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నారు.ఆమె మృతికి దుబాయ్ లోని తెలుగు క్రిస్టియన్ సంఘాలు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..