అమెరికా FBI కే చుక్కలు చూపిస్తున్న భారతీయుడు..!!!
- October 20, 2019అతడి పేరు భద్రేశ్ కుమార్, చూడటానికి ఎంతో సున్నితంగా ఉన్నట్టు కనిపిస్తాడు, నోట్లో వేలు పెట్టినా కొరకగలడా అనే సందేహం వస్తుంది అతడిని చూస్తే. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన సంస్థగా పేరొందిన అమెరికా దర్యాప్తు సంస్థ FBI కే చుక్కలు చూపిస్తున్నాడు. కొన్నేళ్లుగా సదరు సంస్థకి కనపడకుండా దొంగా పోలీస్ ఆడుతున్న అతడు ఇప్పటికి కూడా కనపడక పోవడం పెద్ద సవాల్ గా మారింది.
ఏకంగా అతడిపై 70 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. అంతేకాదు FBI టాప్ 10 వాంటెడ్ లిస్టు లో చోటు కూడా దక్కించుకున్నాడు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏమిటంటే. భారత్ లోని అహ్మదాబాద్ కి చెందిన భద్రేశ్ కుమార్,అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్ లో పనిచేస్తున్నాడు. 2015 ఏప్రియల్ లో తన భార్య తో కలిసి తను పనిచేస్తున్న స్టోర్ లోకి వెళ్ళిన అతడు కొద్ది సేపటి తరువాత బయటకి ఒక్కడే వచ్చాడు.
ఆ తరువాత స్టోర్ లో నుంచీ రక్తపు మరకలు కనపడటంతో పోలీసులకి సమాచారం అందించడంతో హంతకుడు భర్తే నని తేల్చి అప్పటి నుంచీ అతడిని వెతకడం మొదలు పెట్టారు. భారత్ లో చాలా రాష్ట్రాలలో సైతం వెతికిన FBI అమెరికాలో సైతం జల్లెడ పట్టినా ఇప్పటికి అతడి జాడ కనపడక పోవడం పెద్ద సవాల్ గా మారింది. దాంతో ఇరు దేశాల పోలీసులు కలిసి సోదిస్తున్న అతిపెద్ద కేసుగా రికార్డ్ సృష్టించింది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!