పరగడుపున నెయ్యి తింటే ఎన్నో ఉపయోగాలు...
- October 26, 2019
మనలో చాలామంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని కూరల్లో వేసుకుంటారు. కొందరు భోజనం చేసేటప్పుడు అందులో కలుపుకుని తింటారు. ఇక కొందరైతే నెయ్యితో తీపి వంటకాలను చేసుకుని తింటారు. అయితే ఇలా కాకుండా రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టీస్పూన్ నెయ్యి తింటే చాలా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నెయ్యి తిన్న వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో మనకు అనేక ఆరోగ్యకరమై ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణాశయంలో అగ్ని పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు కూడా బాధించవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేడు మన దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటివారు నెయ్యిని తీసుకోవాలి. దీంతో విటమిన్ ఎ పుష్కలంగా లభించి తద్వారా నేత్ర సమస్యలు పోతాయి.
అంతేకాకుండా నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. గర్భిణీ మహిళలైతే నిత్యం నెయ్యిని కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీలక పోషకాలు గర్భిణీ స్త్రీలకు లభిస్తాయి. దాంతోపాటు పిండం చక్కగా ఎదుగుతుందట. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మచ్చలు, మడతలు, మొటిమలు కూడా పోతాయి.
యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువల్ల నెయ్యిని తింటుంటే శరీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే తగ్గిపోతాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. నెయ్యిని నిత్యం తింటుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారం నెయ్యి పాజిటివ్ ఫుడ్. ఇది మిగతా కొవ్వులు, నూనెల్లా కాదు. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్ డి ఎముకలకు మేలు చేస్తుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐతే కొద్ది మోతాదులో మాత్రమే నెయ్యిని తీసుకోవాలి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..