శుక్రవారం షేక్‌ జాయెద్‌ రోడ్‌ పాక్షిక మూసివేత

- October 29, 2019 , by Maagulf
శుక్రవారం షేక్‌ జాయెద్‌ రోడ్‌ పాక్షిక మూసివేత

తొలిసారిగా దుబాయ్‌లోని షేక్‌ జాయెద్‌ రోడ్‌ రన్నింగ్‌ ట్రాక్‌గా మారబోతోంది. నవంబర్‌ 8 శుక్రవారం దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ 2019 కోసం దుబాయ్‌ రన్‌ 30 I 30 ని ఈ రోడ్డుపై నిర్వహిస్తున్నారు. 5 కిలోమీటర్లు అలాగే 10 కిలోమీటర్ల రన్‌లో ఎవరైనా పాల్గొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు రూట్స్‌ దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద ముగుస్తాయి.14 లేన్ల హైవేపై కొంత భాగంలో ప్రజలు రన్‌ చేయడానికి అనుమతిస్తున్నారు. 5 కిలోమీటర్ల రన్‌ అన్ని వయసులవారికీ వర్తిస్తుంది. స్ట్రాలర్లు, వీల్‌ఛెయిర్స్‌ కూడా పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి అందుబాటులో వుంచుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com