అమెరికాను వణికిస్తున్న కార్చిర్చు..
- November 02, 2019
అమెరికా:కాలిఫోర్నియా కార్చిర్చు.. ఇప్పుడు ఇది అమెరికాను వణికిస్తోంది. దీని ధాటికి ఏకంగా లక్షల మందిని అమెరికా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మంటలు అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించి ప్రయత్నిస్తోంది. ఇంత చేస్తున్నా.. కాలిఫోర్నియా అడవులను దహిస్తున్న దావానలం శాంతించడం లేదు.
కొద్ది రోజుల నుంచి అంటుకుంటున్న కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇది రోజురోజుకు విస్తరిస్తున్నదే గానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కార్చిర్చును ఆర్పేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. హెలీకాప్టర్ల సాయంతో వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేస్తున్నారు.
తాజాగా వెంచురా కౌంటీలో నివసిస్తున్న 7 వేల 500 మంది ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.
ఒక్క గురువారమే 12 వేల ఎకరాల అటవీ సంపద బూడిద అయిందట. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 700 అగ్నిమాపక యంత్రాలు కృషి చేస్తున్నాయి.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







