ఇద్దరు వ్యక్తులపై క్రికెట్ బ్యాట్లతో దాడి
- November 04, 2019
యూ.ఏ.ఈ:ఇద్దరు ఆసియా వ్యక్తులపై దాడి జరిగింది. దుండగులు, బాధితుల్ని కిడ్నాప్ చేసి, వారిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేసి, ఎడారిలో డంప్ చేసిన ఘటన అల్ సజ్జా ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంలో జరిగింది. బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అల్ కాసిమి హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్నారు బాధితులు.ఓ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ డ్రైవర్ తమకు సమాచారం అందించారనీ, ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు. ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శరీరంపై తీవ్రగాయాలు వున్నాయనీ, బాధితుల లివర్ దెబ్బతిందనీ, ఇద్దరికీ శస్త్ర చికిత్సలు అవసరమని అల్ ఖాసిమి హాస్పిటల్ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..