యూఏఈ: జీబ్రా క్రాసింగ్ ఉల్లంఘన 400, 500 దిర్హామ్‌ల జరీమానా
- November 04, 2019
అజ్మన్ పోలీస్, రోడ్ క్రాసింగ్ సేఫ్టీ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. పాదచారులకు సంబంధించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అజమ్మన్ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అబ్దుల్లా అల్ ఫలాసి మాట్లాడుతూ, మూడు వారాల పాటు ఈ ఇనీషియేటివ్ కొనసాగుతుందని చెప్పారు. పాదచారులు చేసే తప్పిదాలు, అలాగే జీబ్రా క్రాసింగ్స్ విషయంలో వాహనదారులు చేసే తప్పుల్ని సరిదిద్దడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా మరో చోట రోడ్డును క్రాస్ చేసే వారికి 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనదారులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 500 దిర్హామ్‌లు జరీమానా విధించనున్నారు అధికారులు. 500 దిర్హామ్‌ల జరీమాఆతోపాటు 6 ట్రాఫిక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..