బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌పై పవన్‌ కల్యాణ్‌ 'మా'కు ఫిర్యాదు

- January 12, 2016 , by Maagulf
బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌పై  పవన్‌ కల్యాణ్‌ 'మా'కు ఫిర్యాదు

నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌పై నటుడు పవన్‌ కల్యాణ్‌ 'మా'కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్‌కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్‌లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్‌ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్‌కల్యాణ్‌ 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com