భారీగా దిగొచ్చిన పసిడి ధర..

- November 05, 2019 , by Maagulf
భారీగా దిగొచ్చిన పసిడి ధర..

బంగారం ధరలు ఒకసారి పెరిగితే మరోసారి తగ్గుతాయి. పండుగ వచ్చింది అంటే అన్ని ఆఫర్లు రావచ్చు కానీ బంగారం ధర మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో పసిడి డిమాండ్ తగ్గి మళ్ళి భారీగా దిగొస్తుంది.

ఈ నేపథ్యంలోనే నిన్నటివరకు దంతెరస్, దీపావళి జోరులో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గి రూ.40,370కు చేరింది. ఇదే తరహాలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గి రూ.37,010కు చేరింది. అయితే పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగా అలానే కొనసాగింది.

కేగి వెండి ధర రూ.48,750 వద్ద అలానే నిలకడగా నిలిచింది. ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధర ఇలానే కొనసాగింది. అయితే బంగారం కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే బంగారం ధర తగ్గింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1,509.25 డాలర్లకు క్షీణించింది.

కాగా ఈ ఏడాది దాదాపు 22 శాతం పసిడి ధర పెరిగింది. దీంతో రానున్న రోజుల్లో బంగారం కొనేవారులేక వెలవెలబోతుందట. డిమాండ్ మూడేళ్ల కనిష్టానికి చేరుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజాగా అంచనా వేసింది. దీనికి కారణం బంగారం ధరలు భారీగా పెరగడమే అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంటుంది. మరి బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com