ఆంధ్రప్రదేశ్‌తో ట్రైమెక్స్‌ భారీ ఒప్పందం

- January 12, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌తో ట్రైమెక్స్‌ భారీ ఒప్పందం

హైద్రాబాద్‌కి కేంద్రంగా పనిచేస్తున్న ట్రైమెక్స్‌ గ్రూప్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మైనింగ్‌ ప్రాజెక్ట్స్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 2,500 కోట్లు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం బీచ్‌ శాండ్‌ ప్రాజెక్టుల కోసం ఈ ఒప్పందం కుదిరింది. ట్రైమెక్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కోనేరు, విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వ ప్రతినిథులతో ఎంఓయూపై సంతకం చేశారు. ఇలమ్మెనైట్‌, రుటిల్‌, జిర్‌కాన్‌, గార్నెట్‌, సిల్లిమనైట్‌ తదితర బీచ్‌శాండ్‌ మినరల్స్‌కి సంబంధించి 17.88 చదరపు కిలోమీటర్ల మేర తవ్వకాలకు ప్రభుత్వంతో లీజ్‌ ఒప్పందం కుదిరినట్లు కోనేరు ప్రదీప్‌ చెప్పారు. భావనపాడు ప్రాజెక్ట్‌ కోసం 1500 కోట్లు వెచ్చించనున్నామనీ, ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధినిస్తుందని ఆయన చెప్పారు. కళింగపట్నంలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్‌ చేపట్టనున్నామని అన్నారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com