ఫ్లై దుబాయ్‌కి చెందిన 737 ప్లేన్‌ని లాగిన స్టూడెంట్స్
- November 14, 2019దుబాయ్ పోలీస్ స్కూల్ (హెమాయా) కి చెందిన 30 మంది స్టూడెంట్స్, 737 బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని 150 మీటర్ల మేర లాగారు. ఈ ఫీట్‌ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సాధించారు విద్యార్థులు. ఫ్లై దుబాయ్‌కి చెందిన ఈ విమానాన్ని విద్యార్థులు లాగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దుబాయ్ పోలీస్, దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 30I30లో భాగంగా ఈ ఫీట్‌ని విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. పోటీలో పాల్గొన్నవారంతా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థులే. దుబాయ్ పోలీస్ ట్రైనింగ్ అండ్ అకడమిక్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండెంట్ మేజర్ జనరల్ ముహమ్మద్ అహ్మద్ బిన్ ఫహాద్ మాట్లాడుతూ, ఈ ఘనతను సాధించేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చిన ఫ్లై దుబాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..