ఫ్లై దుబాయ్‌కి చెందిన 737 ప్లేన్‌ని లాగిన స్టూడెంట్స్
- November 14, 2019
దుబాయ్ పోలీస్ స్కూల్ (హెమాయా) కి చెందిన 30 మంది స్టూడెంట్స్, 737 బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని 150 మీటర్ల మేర లాగారు. ఈ ఫీట్‌ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సాధించారు విద్యార్థులు. ఫ్లై దుబాయ్‌కి చెందిన ఈ విమానాన్ని విద్యార్థులు లాగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దుబాయ్ పోలీస్, దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 30I30లో భాగంగా ఈ ఫీట్‌ని విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. పోటీలో పాల్గొన్నవారంతా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థులే. దుబాయ్ పోలీస్ ట్రైనింగ్ అండ్ అకడమిక్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండెంట్ మేజర్ జనరల్ ముహమ్మద్ అహ్మద్ బిన్ ఫహాద్ మాట్లాడుతూ, ఈ ఘనతను సాధించేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చిన ఫ్లై దుబాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..