ఇక ఆ సినిమాలు చేయను: అనుష్క
- November 16, 2019
చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు అంటోంది నటి అనుష్క. నిజానికి ఈ అమ్మడికి పేరు తెచ్చిన పాత్రలన్నీ చారిత్రక కథా చిత్రాల్లోనివేనన్నది తెలిసిందే. సూపర్ చిత్రంతో టాలీవుడ్‌కు, రెండు చిత్రంతోకోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్ తొలి చిత్రాల్లోనే అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. అరుంధతి చిత్రం ఈ అమ్మడుకి అనూహ్యంగా మలుపు తిప్పింది. అందులో జేజెమ్మ పాత్రలో అనుష్కరాజసంతో పాటుఅద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత నటించిన రుద్రమదేవి, బాహుబలి 1, 2 చిత్రాలు నటిగా తారస్థాయిలో కూర్చోబెట్టాయి. ఈ చిత్రాలే ఆమెను హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగానిలబెట్టాయి. అలాంటిది చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ అంటోందట ఈ బ్యూటీ. ప్రస్తుతం సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దంఅనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటిస్తోందని సమాచారం.
మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి అంజలి కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నటి అనుష్క ఒక ఇంటర్వ్యూలో ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడదనినిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ తరహా చిత్రాలను పూర్తి చేయడానికి అధిక రోజులు పడుతోందని, అదీ కాకుండా మేకప్‌కు అధిక సమయం పడుతోందని చెప్పుకొచ్చింది.
ఆ తరహా చిత్రాలకు అధిక సమయాన్నికేటాయించడంవల్ల ఆరోగ్యపరంగా అలసటకు గురవుతున్నట్లు తెలిపింది. ఇలాంటి కారణాలతోనే చరిత్ర కథా చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్‌లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను ఆ చిత్రంలో నటించడానికి నిరాకరించినట్లు తాజా సమాచారం. తదుపరి దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అనుష్క నటించే అవకాశం ఉన్న ట్లు తాజా సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..