భారత పైలట్ ప్రమాద హెచ్చరిక..కరుణ చూపి ప్యాసెంజర్స్ ప్రాణాలను కాపాడిన పాకిస్తాన్
- November 17, 2019
జైపూర్ నుంచి మస్కట్ వెళ్తున్న భారత విమానానికి గగనతరంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో దగ్గరలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం ఇచ్చారు. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించారు. తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వందలాది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. గురువారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత విమానం గగనతలంలో ప్రయాణించే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. దక్షిణ సింధు ప్రాంతంలో పైలట్ ఇబ్బంది పడ్డారు. వెంటనే సంబంధిత స్టేషన్లకు సమాచారం పంపారు. వెంటనే పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించారు. తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీనిని న్యూస్ ఇంటర్నేషనల్ కొట్ చేసింది.
గగనతలంలో విమానం కుదుపునకు గురైన సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి 34 వేల అడుగులకు కిందకొచ్చింది. దీంతో పైలట్ అప్రమత్తమై.. సమాచారం ఇవ్వడంతో పాకిస్థాన్ ఎయిర్ కంట్రోల్ సిబ్బంది స్పందించారు. తదుపరి ప్రయాణాన్ని తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
వాస్తవానికి గగనతలంలో ఆయా దేశాలకు ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది. బాలాకోట్ దాడుల తర్వాత తమ గగనతలంలో ఇండియాకు పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. సాధారణ విమానాలే గాక, వీఐపీ, వీవీఐపీ ప్లైట్లను కూడా అనుమతించలేదు. ప్రధాని మోడీ విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ భారత పైలట్ ప్రమాద హెచ్చరికతో కాస్త కరుణ చూపి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చి ప్యాసెంజర్స్ ప్రాణాలను కాపాడింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..