'అగ్రవన్' గా మారనున్న ఆగ్రా
- November 18, 2019
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మార్చడం మొదలెట్టారు. ఇప్పడు తాజాగా.. ఆ జాబితాలోకి ఆగ్రా కూడా చేరనుంది. దీనికోసం డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పుపై ప్రయత్నాలు ప్రారంభించింది. ఆగ్రాకు 'అగ్రవాన్' అని పేరు మార్చడానికి ప్రతిపపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చరిత్రను వెలికితీసే పనిలో పడ్డారు. ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అంబేద్కర్ వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. తాజ్నగర్కు మొదట్లో అగ్రవాన్ అనే పేరు ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్, అగ్రబాణ్ అని పిలిచేవారుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను వెలికితీస్తున్నట్లు ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..