ఎయిర్ అంబులెన్స్‌లో లండన్ కు నవాజ్ షరీఫ్
- November 19, 2019
హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఇవాళ ఎయిర్ అంబులెన్స్‌లో లండన్ వెళ్తున్నారు. పర్సనల్ డాక్టర్ అద్నన్ ఆయనతో కలిసి వెళ్లనున్నారు. వైద్య చికిత్స నిమిత్తం నవాజ్ షరీఫ్‌ను లండన్‌కు తరలిస్తున్నారు. లండన్‌లో డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాత.. షరీఫ్‌ను అమెరికా తీసుకువెళ్లాలా లేదా అన్న అంశాన్ని ఆలోచిస్తామని షెబాజ్ షరీఫ్ తెలిపారు. నవాజ్, షెబాజ్ దేశం విడిచి వెళ్తున్న నేపథ్యంలో.. పీఎంఎల్-ఎన్ పార్టీ వ్యవహారాలను సీనియర్లు చూసుకోనున్నారు. లాహోర్‌లోని హజ్ టర్మినల్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ విమానంలో షరీఫ్‌ను తీసుకువెళ్లనున్నారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ కాపీని ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులో షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..