మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడేం చేద్దాం!: బిల్‌గేట్స్ తో స్మృతి ఇరానీ
- November 19, 2019
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు. వివరాలు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆయనతో కలిసి భారతీయ పోషణ్ కృషి కోష్ అనే కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్మృతీ మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడేం చేద్దాం! అంటూ క్యాప్షన్ జతచేశారు.
దీనర్థం ఏంటంటే.. బిల్‌గేట్స్, స్మృతి ఇరానీ ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. కనీసం డిగ్రీకూడా పూర్తిచేయకుండా బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగితే, స్మతి ఇరానీ కేంద్రమంత్రిగా ఎదిగారు. దీన్ని బట్టి చూస్తే చదవకపోవడం అనేది భవిష్యత్తులో ఎదగడానికి అడ్డంకి కాదని ఆమె అభిప్రాయం. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్మతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని పేర్కొన్న విషయం విదితమే.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..