జర్మనీ:రూ.7,800 కోట్ల నగలను సింపుల్ గా చోరీ

- November 26, 2019 , by Maagulf
జర్మనీ:రూ.7,800 కోట్ల నగలను సింపుల్ గా చోరీ

జర్మనీ:సుమారు వందకు పైగా అత్యంత విలువైన నగలను, వజ్రాలను.. కేవలం ఇద్దరు దొంగలే ఒక జర్మనీ లోని ప్రముఖ మ్యూసియం నుంచి దొంగలించారు. ఎప్పుడూ ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉన్నపటికీ ఇంకా ఎలక్ట్రానిక్ వ్యవస్థతో ఫుల్లుగా ప్రొటెక్షన్ ఉన్నా ఈ మ్యూజియం లో చోరీ జరగడం గమనార్హం ఈ సంఘటన యూరప్ ఖండం మొత్తంలో సంచలనం సృష్టిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పెద్ద చోరీ ఏదైనా ఉందంటే.. అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నదే


జర్మనీలోని గ్రీన్ వాలెట్ భవనంలో దాదాపుగా 4000 విలువైన వస్తువులను 1723 సంవత్సరం నుంచి భద్రపరుస్తున్నారు. నిఘా కెమెరాల ద్వారా పోలీసులకు ఏం తెలిసిందంటే.. దొంగతనానికి వచ్చిన నిందితులు..గ్రీన్ వాలెట్ లోని ఓ భాగమైన డ్రెస్డెన్‌ మ్యూజియం యొక్క ఒక కిటికీ ఇనుప కడ్డీలను వంచి.. ఆపై బలమైన అద్దాన్ని పగులగొట్టి అందులోకి ప్రవేశించినట్లు తెలిసింది.

అయితే దుండగులు చోరీ చేసే కొన్ని నిమిషాల ముందు సమీపంలో ఉన్న పెద్ద విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి.వీరే విద్యుత్ అగాదం జరిగేట్లు పక్క ప్రణాళికను రూపొందించారు. దాంతో మ్యూజియంకు ఎప్పుడూ నిరంతరాయంగా సరఫరా అయ్యే కరెంటు అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పుడు మ్యూజియంలోని వార్నింగ్ లు ఇచ్చే ఎలక్ట్రానిక్ అలరాములు కూడా పనిచేయడం ఆగిపోయాయి. అందుకే వారు దొంగతనం చేసే సమయంలో ఎలాంటి అలారం మోగలేదు. కరెంటు పోయిన వెంటనే మ్యూసియంలోకి ప్రవేశించే ద్వారాలన్నీ అక్కడి సిబ్బంది మూసివేశారు. కానీ ఆ ద్వారాలను మూసివేసేలోపే దొంగలు రెడీ గా బయట పార్క్ చేసి ఉన్న ఒక ఆడి కారులో రూ. 7, 800 కోట్ల విలువ చేసే వజ్రాలను, నగలను వేసుకొని పరారయ్యారు.

ఈ మ్యూజియంలో 41క్యారెట్ల ఆకుపచ్చ వజ్రం కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆకుపచ్చ వజ్రంగా కీర్తిగడించింది. ప్రస్తుతం ఇది న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియంలో ఉండటంతో దొంగలబారిన పడలేదు. 49.7 క్యారెట్ల డ్రెస్డన్‌ వైట్‌ డైమండ్‌ , 648 క్యారెట్ల నీలం కూడా పదిలంగానే ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com