రోడ్డు ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుకి గాయాలు..

- November 27, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుకి గాయాలు..

సిద్ధిపేట: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి సంపూర్ణేష్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సంపూతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆయన కుటుంబ సభ్యలకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com