శ్రీదేవి ఆటో బయోగ్రఫీ విడుదల
- December 02, 2019దివంగత అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర 'శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్' అనే పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం.
'ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.
శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత సత్యార్థ్ నాయక్ సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. 'శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్' బుక్ కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు