LIC పాలసీదారులకు శుభవార్త
- December 03, 2019భుత్వ రంగ బీమా సంస్థ ఎల్.ఐ.సి. ఈ సంస్థ తన పాలసీదారులకు ఓ శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధించనున్న చార్జీలను డిసెంబరు ఒకటో తేదీ నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో క్రెడిట్ కార్డు ద్వారా రెన్యూవల్ ప్రీమియం, నూతన ప్రీమియం లేదా రుణాల చెల్లింపులు, పాలసీలపై తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులపై అదనపు రుసుంను వసూలు చేయరు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక క్రెడిట్ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలను ఉచితంగా జరుపుకోవచ్చును.
అంతేకాకుండా, కార్డు రహిత చెల్లింపులు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల వద్ద కార్డు డిప్/స్వైప్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడదని ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే వినియోగదారుడు మైఎల్ఐసీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని ఎల్.ఐ.సి ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!