యూఏఈలో భవనంపై నుంచి పడి చిన్నారి మృతి

- December 10, 2019 , by Maagulf
యూఏఈలో భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
యూఏఈలో రెండేళ్ల చిన్నారి భవనంపై నుంచి పడి మృతి చెందింది. షార్జాలోని అల్ మజాస్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ అపార్ట్మెంట్లో గత కొన్నాళ్లుగా సిరియన్ కుటుంబం నివసిస్తోంది. ఫ్లాట్ ఉన్న 8వ ఫ్లోర్ నుంచి రెండేళ్ల పసిపాప కిందపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పాట్రోల్స్ & పారామెడిక్స్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అల్ బుహైర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com