వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాన్ కు దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ రెడీ
- December 11, 2019
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాలను పర్యావరణహితంగా మార్చేందుకు తొలి అడుగు పడింది. వచ్చే జనవరి నుంచి అత్యంత రద్దీగా ఉండే DWD, DWC విమానాశ్రయాల్లో వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి రానుంది. ప్రతీ ఏడాది ఈ రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రాయాణం సాగించే దాదాపు 90 మిలియన్ల మంది టన్నుల కొద్ది వాటర్ బాటిల్స్, స్ట్రాస్, డైలీ కాఫీ లిడ్స్ వినియోగిస్తుంటారు. అయితే..జూన్-2019లో నిర్దేశించుకున్న సంకల్పం మేరకు దాదాపు 250 స్టాల్స్, అతిథ్య భాగస్వామ్యులతో కలిసి కొత్త ఏడాదిలో దుబాయ్ విమానాశ్రయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృషి జరుగుతోంది.
పర్యావరణహితం కోరే బాధ్యతాయుతమైన విమానాశ్రయంగా రూపుదిద్దుకోటంలో తమ సంకల్పంలో ఈ చర్య ఓ మెట్టు కానుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ లోని ఈవీపీ కమర్షియల్ ప్రతినిధి యుజిన్ బెర్రి పేర్కొన్నారు. తమ భాగస్వామ్యంలోని గ్లోబల్ బ్రాండ్స్ మెక్ డొలాల్డ్, కోస్టా కాఫీ, స్టార్ బక్స్ లో వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. అంతేకాదు.. వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో పర్యావరణహితంగా ఉండే ప్రత్యామ్నాయాలను వినియోగించబోతున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో జనవరి 1, 2020 నుంచి కేఫ్ లు, రెస్టారెంట్లలో ప్లాస్టిక్ కత్తులు, డ్రింకింగ్ స్ట్రాస్, టేక్ అవే ఫుడ్ ప్యాకేజింగ్, పాలిథిన్ కవర్లు కనిపించవు. ఈ తర్వాతి పన్నెండు నెలల్లో దశల వారీగా మరికొన్ని ప్లాస్టిక్ వస్తువులకు పూర్తి స్థాయి ప్రత్యామ్నాయలను వినియోగంచేలా చర్యలు తీసుకుంటున్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ తమకు అతిపెద్ద సవాల్ గా మారుతోందని బెర్రి అన్నారు. విమానాశ్రయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించటం, వీలైతే పూర్తిగా నిర్మూలించేందుకు వినియోగదారులు, కొత్త భాగస్వామ్యులతో కలిసి రీసైక్లింగ్ సౌకర్యాలను పెంచుతున్నట్లు వెల్లడించారు. తద్వారా ప్రతీ ఏడాది టన్నుల కొద్ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను సరైన విధంగా డిస్పోజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







