ఈ నెల 23 నుంచి 'కోటీశ్వరి' గేమ్‌ షో

- December 15, 2019 , by Maagulf
ఈ నెల 23 నుంచి 'కోటీశ్వరి' గేమ్‌ షో

చెన్నై: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్‌ షోను కలర్స్‌ తమిళ చానల్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్‌ చానల్‌ తమిళ్‌ బిజినెస్‌ హెడ్‌ అనూప్‌ చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు కలర్స్‌ తమిళ టీవీ చానల్‌లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్‌ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్‌ తమిళ టీవీ చానల్, స్టూడియో నెక్ట్స్‌ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కలర్స్‌ చానల్‌ వ్యాపారాధ్యక్షుడు అనూప్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్‌ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్‌ కుమార్‌ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com