రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న‘పింక్’ తెలుగు రీమేక్
- December 16, 2019
మొత్తానికి ‘పింక్’ తెలుగు రీమేక్ పట్టాలు ఎక్కుతోంది. అయితే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పేరుని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఆ విషయమై అభిమానులు ఎదురూచూస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా ఏ సీజన్ లో రిలీజ్ చేస్తే బాగా రీచ్ అవుతుందనే విషయమై చర్చిస్తున్నారు. ఎందుకంటే పింక్ షూటింగ్, కాస్టింగ్ విషయమై దర్శక,నిర్మాతలు క్లారిటీతో ఏ కన్ఫూజన్ లేకుండా ఫిక్సై ఉన్నట్లు సమాచారం.
అలాగే సినిమా రిలీజ్ కూడా వేసవిలో అంటే మే నెల చివరి వారంలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పింక్ రీమేక్ కు భారీగా ఖర్చుపెట్టరు. అదో చిన్న సినిమా. అదే విధంగా పవన్ డేట్స్ కూడా చాలా తక్కువ అవసరం అవుతాయి. షూటింగ్ స్టార్ట్ అయ్యాక తన డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని పవన్ వచ్చి జాయిన్ అవుతారని తెలుస్తోంది.
ఇక చిత్రం వివరాల్లోకి వెళితే...బాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి హిట్ అయిన చిత్రం ‘పింక్’. మహిళల రక్షణ చుట్టూ సాగే ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నారు. ఈ రీమేక్‌కు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నారు. ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు.
అలాగే `లాయర్ సాబ్` అనే టైటిల్‌ని పరిశీలుస్తున్న ఈ రీమేక్‌లో మరో కీలకపాత్రలో నివేదా థామస్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పింక్’ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం నివేదాను సంప్రదించినట్లు కూడా చెప్తున్నారు. దీనిపై ఎటువంటి అఫీషియల్ ఎనౌన్సమెంట్ వెలువడలేదు.
అంతేకాకుండా ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర బేనర్‌పై రూపొందుతున్న 40వ సినిమా ఇది. అద్భుతమైన ట్యూన్‌తో పింక్ చిత్ర పనులు మొదలు అయ్యాయి అని నిర్మాణ సంస్థ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..