కువైట్‌:ప్రైవేట్‌ సెక్టార్‌లో పెరిగిన వలసదారులు

- December 17, 2019 , by Maagulf
కువైట్‌:ప్రైవేట్‌ సెక్టార్‌లో పెరిగిన వలసదారులు

కువైట్‌: ప్రైవేట్‌ సెక్టార్‌లో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 జూన్‌ నుంచి 2019 మధ్య ఈ సంఖ్య 58,000కి పైగా నమోదయ్యింది. హోల్‌సేల్‌ మరియు రిటెయిల్‌ సెక్టార్‌లో వర్కర్స్‌ సంఖ్య 51.3 శాతంగా పెరిగితే, ఇందులో 29,597 మంది కొత్త వర్కర్స్‌. ఆటోమొబైల్స్‌ మరియు మోటర్‌ సైకిల్స్‌ విభాగంలో 14 శాతం పెరుగుదల నమోదయ్యింది. మొత్తం 8,109 వర్కర్స్‌ కొత్తగా ఈ రంగంలో చేరారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీస్‌లోనూ పెరుగుదల నమోదయ్యింది. స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రాసెక్టుల్లో మూడు నెలల్లోనే 5,000 పెరుగుదల కన్పించింది. కాగా, సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ వలసదారుల వీసా విషయమై రెండు క్రిమినల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌లను తప్పనిసరిగా సమర్పించలని ఆదేశించిన విషయం విదితమే. క్రిమినల్‌ రికార్డ్‌ కలిగి వున్నవారిని దేశంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com