బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ మృతి
- January 15, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ ఉపాధ్యాయ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు. ఓ సౌత్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. లగాన్ సినిమాలో ఆయన నటించిన గోరన్ పాత్రతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టివి షోలలోనూ రాజేష్ వివేక్ నటించారు.రాజేష్ వివేక్, శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన జునూన్ చిత్రంతో 1978లో సినీరంగ ప్రవేశం చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో కనిపించిన రాజేష్ వివేక్, ఆ తరువాత కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో పెంబా పాత్రలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.ఎన్నో మంచి పాత్రలతో అలరించిన రాజేష్ వివేక్ ఉపాధ్యాయ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









