250,000 ఫ్లవర్‌ ప్లాంట్స్‌తో ఖతార్‌ నేషనల్‌ ఫ్లాగ్‌

- December 18, 2019 , by Maagulf
250,000 ఫ్లవర్‌ ప్లాంట్స్‌తో ఖతార్‌ నేషనల్‌ ఫ్లాగ్‌

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ - ది పబ్లిక్‌ పార్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, 250,000 ఫ్లవర్‌ ప్లాంట్స్‌తో ఖతార్‌ నేషనల్‌ ఫ్లాగ్‌ని ఖతార్‌ నేషనల్‌ డే సందర్భంగా కోర్నిచ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 110 చదరపు మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు.. వెరసి 2,000 చదరపు మీటర్ల ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 90,000 తెల్లటి పూలను అలాగే 160,000 బుర్గుండీ కలర్డ్‌ ఫ్లవర్స్‌ని వినియోగించారు. అలాగే 20 ఫ్లవర్‌ టవర్స్‌, 130 హ్యాంగింగ్‌ ఫ్లవర్స్‌ని కోర్నిచ్‌ రోడ్‌ అంతటా అమర్చారు. దర్బ్‌ అల్‌ సాయ్‌ మరియు కటారా కల్చరల్‌ విలేజ్‌లోనూ ఖతార్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా డెకరేషన్స్‌ జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com