దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రా ప్రకటన; ఫిలిపిన, ఇండియన్ లక్కీ ఫెలోస్
- December 20, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రాలో వలసదారుల పంట పండింది. ఫిలిపినకు చెందిన మెలోడీ కర్టియానియా మిలియన్ యూఎస్ డాలర్లను ప్రైజ్ మనీగా గెలుచుకుంది. మరో ఇండియన్ కూడా మిలియన్ యూఎస్ డాలర్లు విన్ అయినట్లు తెలుస్తున్నా..నిర్వాహకులు అతని పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. లక్కీ డ్రా విన్నర్ మెలోడీ
కర్టియానియా దుబాయ్ లోని ఓ బీమాసంస్థలో పని చేస్తోంది. డ్రాలో మిలియన్ డాలర్లు విన్ అయినట్లు తెలుసుకోగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాను దేవుణ్ణి ఎంతగానే ప్రార్ధించానని..తన ప్రార్థనలు నిజం అయ్యాయని కర్టియానియా ఆనందం వ్యక్తం చేసింది. క్రిస్మస్ తో తన భర్త్ డేకి మరిచిపోలేని గిఫ్ట్ ప్రకటించారంటూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు ఈ డ్రాలో మరో ముగ్గురు లగ్జరీ వాహనాలను గెలుచుకున్నారు. యుకెకు చెందిన విలియం డంకన్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ 560, జర్మనీకి చెందిన రైఫ్ సైనోజిక్ రేంజ్ రోవర్ హెచ్‌ఎస్‌ఇ 360 పిఎస్ మోడల్ కార్లను డ్రాలో విన్ అయ్యారు. ఇండియన్ మహ్మద్ మోమిన్ ఎపిల్లా టుయోనో ఆర్ఆర్ మోటర్‌బైక్‌ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..