హిట్&రన్ డ్రైవర్ ను 3 గంటల్లో అరెస్ట్ చేసిన UAE పోలీసులు

- December 21, 2019 , by Maagulf
హిట్&రన్ డ్రైవర్ ను 3 గంటల్లో అరెస్ట్ చేసిన UAE పోలీసులు

ఉమ్ అల్ కువైన్: యూరోపియన్ వుమెన్ మోటరిస్ట్ ఢీ కొట్టి పారిపోయిన డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు 3 గంటల్లో అరెస్ట్ చేశారు. ఎతిహద్ నుంచి అజ్మన్ వెళ్లే రోడ్డులో ఈ యాక్సిడెంట్ జరిగింది. యూరప్ మహిళ బైక్ పై వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను ఢీకొట్టి ఎలాంటి సాయం అందించకుండానే పారిపోయాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న UAQ పోలీసులు వెంటనే ట్రాఫిక్ అండ్ పాట్రోలింగ్ పోలీసులను అలర్ట్ చేశారు. హుటాహుటిన స్పాట్ కు చేరుకున్న ట్రాఫిక్ పాట్రోలింగ్ పోలీసులు..స్పాట్ లో పడిపోయిన మహిళను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె బైక్ పూర్తిగా డ్యామేజ్ అయిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి సాయం అందిస్తూనే హిట్ అండ్ రన్ డ్రైవర్ కోసం
వేట మొదలు పెట్టిన 3 గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. బైక్ ఢీకొట్టినట్టుగా కారుపై ఆనవాళ్లను గుర్తించారు. 20 ఏళ్ల డ్రైవర్ పేరును S.H. గుర్తించారు. లీగల్ యాక్షన్ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అతన్ని పంపించారు. డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని సూచించారు. ఒకవేళ అనుకోని ప్రమాదం
జరిగితే..స్పాట్ నుంచి పారిపోయే ప్రయత్నం చేయొద్దన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com