హీరా గోల్డ్ నౌహీరా షేక్ కేసులన్నీ SFIO కు బదిలీ
- December 25, 2019
హైదరాబాద్: సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులను మోసం చేసి సుమారు రూ. 5600 కోట్లను కాజేసిన ఆరోపణపై 2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు
హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నౌహీరా షేక్‌కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్‌పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్‌పై 10 కేసులు ఉన్నాయి. బుధవారం నాడు హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్‌ను ఆదేశించింది. కోర్టులో ఆమె పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..