మహేష్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట.. ఇద్దరికి గాయాలు

- December 25, 2019 , by Maagulf
మహేష్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట.. ఇద్దరికి గాయాలు

 

 

సూపర్‌స్టార్ మహేష్ బాబు షూటింగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా ఇవాళ చందానగర్‌లో మహేష్ ఫొటోషూట్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ను చూసేందుకు అక్కడకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు అక్కడకు చేరుకున్న అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com