దుబాయ్ :భారతీయ సామాజిక కార్యకర్త నంది నాజర్ గుండెపోటుతో మృతి

- December 29, 2019 , by Maagulf
దుబాయ్ :భారతీయ సామాజిక కార్యకర్త నంది నాజర్ గుండెపోటుతో మృతి

ప్రముఖ సామాజిక కార్యకర్త నంది నాజర్(56) ఆదివారం తెల్లవారుజామున గుండేపోటుతో మృతి చెందారు. దుబాయ్ లోని ప్రవాస భారతీయులకు ఆయన ఎంతో సేవలు చేశారు. ముఖ్యంగా ఉపాధి కోసం యూఏఈ వలసవచ్చిన పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. యూఏఈలో ఎక్కడ ప్రవాసీయులకు సమస్య తలెత్తిన పరిష్కరించటంలో ఆయన ముందుండేవారు. అటు పోలీసులకు, ఇటు ప్రవాసీయులను సమన్వయం చేస్తూ సహకరించేవారు.

నంది నాజర్ కు శనివారం రాత్రి సమయంలో ఛాతి నొప్పి రావటంతో వెంటనే అయన్ని దుబాయ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణం ప్రవాసీయులను విషాదంలో నింపింది. యూఏఈలోని సామాజిక కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ వర్కర్ నసీర్ మాట్లాడుతూ' ఆయన మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నా.  ప్రవాసీయుల సమస్యలను తీర్చటంలో దుబాయ్ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి ఎంతగానో కృషి చేశారు. యూఏఈలో చాలామందికి ఆయన సాయం చేశారు' అని నంది నాజర్ సేవలను గుర్తుచేసుకున్నారు.

కేరళలోని కోయిలాండి ప్రాంతానికి చెందిన నంది నాజర్ ఇమ్మిగ్రేషన్ ప్రొబ్లామ్స్ ఫేస్ చేసే ప్రవాసీయులకు చేదోడుగా నిలిచేవారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఇండియన్స్ తో పాటు యూఏఈ చట్టాలు తెలియక జైలుపాలైన వారికి సహాయం చేసేవారు. 'చేంజ్ లైఫ్, సేవ్ లైఫ్' పేరుతో వెల్ఫేర్ గ్రూప్ ఏర్పాటు చేసి తన సేవలను కొనసాగించారు ఆయన. యూఏఈ కంట్రీస్ లో మృతిచెందిన వారి మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు తరలించటంలో ఆయన దగ్గరుండి ఫార్మాలిటీస్ చూసుకునేవారు. అంతేకాదు ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కుటుంబాలకు కూడా ఆయన సాయం చేశారు. నంది నాజర్ భౌతిక కాయన్ని ముహైస్నాలోని మెడికల్ ఫిట్‌నెస్ సెంటర్‌కు తరలించారు. అక్కడే ఎంబామింగ్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com