శంషాబాద్‌ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత

- January 16, 2016 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత

అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వస్తున్న విమానంలో బంగారం తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో విమానం దిగి వస్తున్న ప్రయాణికులను అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వాస్‌ మరికొంతమంది అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా సిగరెట్‌ ప్యాకెట్లలో పెట్టుకొని తీసుకొస్తున్న నాలుగున్నర కిలోల బంగారం బిస్కెట్లు అతడి వద్ద లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com