స్విమ్మింగ్‌ పూల్‌ డెత్‌ ట్రయల్‌: జిమ్‌ మేనేజ్‌మెంట్‌కి ఊరట

- December 30, 2019 , by Maagulf
స్విమ్మింగ్‌ పూల్‌ డెత్‌ ట్రయల్‌: జిమ్‌ మేనేజ్‌మెంట్‌కి ఊరట

బహ్రెయిన్: ఓ వ్యక్తి స్విమ్మింగ్‌ పూల్‌లో మృతి చెందిన ఘటనకు సంబంధించి, ఆ ప్రాంగణాన్ని నిర్వహిస్తోన్న జిమ్‌ మేనేజ్‌మెంట్‌కి ఊరట లభించింది. కింది స్థాయి కోర్టు, ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి 40,000 బహ్రెయినీ దినార్స్‌ నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించగా, సదరు సంస్థ హై అప్పీల్‌ కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంగణంలో సహాయకులు ఎవరూ లేరనీ, లైఫ్‌ జాకెట్స్‌ కూడా అందుబాటులో వుంచలేదనీ, ఈ కారణంగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బాధిత కుటుంబం పేర్కొంది. అయితే, 1.3 మీటర్ల లోతులోనే స్విమ్మింగ్‌ పూల్‌ వుందనీ, లైఫ్‌ జాకెట్లు అవసరంలేదని తన వాదనల్ని విన్పించిన జిమ్‌ సంస్థ, ఆ స్విమ్మింగ్‌ పూల్‌కి రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్‌ గనుక అతనికి అన్ని విషయాలూ తెలుస్తాయనీ, ఇఫ్తార్‌ సమయంలో సహాయకులు ఎవరూ వుండరని తెలిసి కూడా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగారని జిమ్‌ యాజమాన్యం పేర్కొంది. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన జరీమానా చెల్లించాలనే తీర్పుని కొట్టివేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com