హీరో రాజశేఖర్ రాజీనామాకు 'మా' ఆమోదం

- January 05, 2020 , by Maagulf
హీరో రాజశేఖర్ రాజీనామాకు 'మా' ఆమోదం

హైదరాబాద్:'మా' ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి సినీ నటుడు రాజశేఖర్ చేసిన రాజీనామాను మా ఆమోదించింది. మా అధ్యక్షుడు నరేష్‌పై అసంతృప్తితో తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యకలాపాల పట్ల క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసింది మా. అందులో సభ్యులుగా కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధ ఉండనున్నారు.

అయితే ఈ నెల 2వ తేది జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడే సమయంలో రాజశేఖర్ ఆయన ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడ్డారు. ఒకానొక సమయంలో చిరు దగ్గర నుంచి మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో చిరంజీవి కాస్త అసహనానికి గురయ్యారు. ఈ చర్యను పలువురు ఖండించారు. మరోవైపు అదే రోజే మాలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ నరేష్‌పై ఆయన ఆరోపణలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com