బ్రేకింగ్:చంద్రబాబు నాయుడు అరెస్ట్!

- January 08, 2020 , by Maagulf
బ్రేకింగ్:చంద్రబాబు నాయుడు అరెస్ట్!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని  అరెస్ట్ చేసిన పోలీసులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు అతని సుపుత్రుడు నారా లోకేష్‌, ఇతర టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు, జేఏసీ నేతల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబు సహా టీడీపీ నేతలను పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. అమరావతి జేఏసీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆటోనగర్ వద్దకు బస్సులను ప్రారంభించటానకి పాదయాత్రగా బయలు దేరిన చంద్రబాబును, వామపక్షనేతలను, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పాదయాత్రకు అనుమతి లేదని, వెంటనే వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. వారు మాత్రం బస్సులు నిలిపివేసిన ప్రాంతానికి వెళతామని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలుగు తమ్ముళ్లు అక్కడికి భారీగా చేరుకున్నారు.

బాబు దగ్గరకు వెళ్లేందుకు లోకేష్ ప్రయత్నించారు. దీనికి పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బెంజిసర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలీసులతోగొడవకు సిద్దం అవ్వడంతో చంద్రబాబు, లోకేష్‌తో సహా ఇతర నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com