'తెలుగు తరంగిణి' సంక్రాంతి సంబరాలు

- January 17, 2016 , by Maagulf

రాస్ అల్ ఖైమాలో తెలుగు తరంగిణి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్ధన, స్వాగత సందేశంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.సంప్రదాయం దుబాయి వారి సౌజన్యంతో శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణు సహస్ర నామార్చన  కన్నుల పండుగగా నిర్వహించబడింది.మధ్యాహ్నం చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఆశీర్వచనం, బొమ్మల కొలువు నిర్వహించారు. హరిదాసుల సందడి, మహిళల రంగ వల్లులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు.నిర్వాహకులు రాస్ అల్ ఖైమాలో పల్లెటూరు వాతావరణాన్ని నెలకొల్పారు. సాయంత్రం 4 గంటలకు తంబోలా ఆట సరదా సరదాగా సాగింది తరువాత వివిధ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల్ని అందజేశారు. థ్యాంక్స్ మీట్తో ఈకార్యక్రమాలు ముగిశాయి. సంప్రదాయ విందు భోజనం, సాయంత్రం 4.30 నిమిషాలకు స్నాక్స్ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ సురేష్ గారు, ఎక్షిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ గారు, సెక్రెటరి నందా గారు, ట్రషరర్ రాజేష్ గారు మరియు తరంగిణి సభ్యులు అందరూ  కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్ గారు, మైథిలి గారు ఏంకర్లుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారం అందించింది.మాగల్ఫ్.కామ్ టీం తరపున 'తెలుగు తరంగిణి టీం' కు అభినందనలు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com