షార్జా:గాంబ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట
- January 11, 2020
షార్జా: షార్జా పోలీస్, పబ్లిక్ ప్లేస్‌లలో గాంబ్లింగ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. పబ్లిక్ ప్రాంతాలతోపాటు, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో కూడా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇన్సాద్ (రెసిడెన్షియల్ పెట్రోల్‌స) ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గ్యాంబ్లర్స్, స్ట్రీట్ వెండర్స్, బెగ్గర్స్‌తోపాటు పైరేటెడ్ సీడీలు, టొబాకో ప్రోడక్ట్స్‌ని విక్రయిస్తున్నవారిపైనా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది షార్జా పోలీసులు, గ్యాంబ్లింగ్ డెన్స్‌పై దాడులు నిర్వహించి పలువురు ఆసియా జాతీయుల్ని అరెష్ట్ చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!