'సరిలేరు నీకెవ్వరు':రివ్యూ

'సరిలేరు నీకెవ్వరు':రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.


కథ :

ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఒక ఆపరేషన్ లో మరో ఆర్మీ ఆఫీసర్ అజయ్ (సత్య దేవ్) ప్రాణాపాయ స్థితిలో ఉండగా అతని చెల్లి పెళ్ళికి ఆయన బదులుగా అజయ్ కృష్ణ కర్నూలు వస్తాడు. ప్రొఫెసర్ అయిన భారతి(విజయశాంతి)ని తన ఫ్యామిలీని చంపాలని చూస్తాడు మినిస్టర్ నాగేంద్ర. కర్నూలు చేరుకున్న అజయ్ కృష్ణ భారతి ఫ్యామిలీకి సపోర్టర్ గా ఉంటాడు. మినిస్టర్ భారతి ఫ్యామిలీని ఎందుకు చంపాలని అనుకున్నాడు. అజయ్ కృష్ణ ఆ మినిస్టర్ ను ఎలా దెబ్బ తీశాడు. ఈ క్రమంలో అజయ్ కృష్ణ నాగేంద్రని ఎలా మార్చాడు అన్నది సినిమా కథ.


విశ్లేషణ :

సూపర్ స్టార్ మహేష్ సూపర్ ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూ మాస్ ఆడియెన్స్ కు దూరమవుతున్న మహేష్ ఈ సినిమాతో ఆ ఆకలి తీర్చేలా చేశాడు. సరిలేరు నీకెవ్వరు టైటిల్ కు తగినట్టుగానే మహేష్ కు సరిలేరు ఎవరు అని మరోసారి తెలిసేలా చేశాడు. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు తెచ్చుకుంది.


అయితే కథ విషయానికొస్తే మాత్రం అనీల్ మళ్లీ రొటీన్ గానే నడిపించాడని చెప్పాలి. కథనం మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో కితకితలు పెడతాడు. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషనల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ పార్ట్ బాగుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా మహేష్ డ్యాన్స్ అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే డ్యాంగ్ డ్యాంగ్.. క్లైమాక్స్ లో వచ్చే మైండ్ బ్లాంక్ నిజంగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాంక్ చేస్తాయి.


అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో బలమైన కథ లేదని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బలహీనమైన రొటీన్ కంటెంట్ తో వచ్చిందని చెప్పాలి. అయితే మహేష్ డైలాగ్స్, యాక్షన్, డ్యాన్స్ అదిరిపోయాయి. సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు అంచనాలను అందుకోలేకపోయినా సూపర్ స్టార్ ఫ్యాన్స్.. సగటు సిని అభిమానులకు మంచి ఐ ఫీస్ట్ సినిమా అని చెప్పొచ్చు.


నటీనటుల ప్రతిభ :

సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ అదరగొట్టేశాడు. డైరక్టర్ రాసుకున్న పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మహేష్ ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో మరోసారి అందరికి తెలిసేలా చేశాడు. ఇక సినిమాలో రష్మికకు అంతగా ఇంపార్టెన్స్ లేని పాత్రే అని చెప్పాలి. ట్రైలర్ లో ఉన్న ఎపిసోడ్స్ మాత్రమే తప్ప రష్మికని పెద్దగా వాడుకోలేదు. ఇక విశ్వ నట భరై విజయశాంతికి మాత్రం మంచి పాత్ర పడ్డది. ఉన్నంతలో ఆమె ది బెస్ట్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలానే విలన్ గా మెప్పించారు. వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, హరితేజ, రావు రమేష్ ఇలా అందరి తమ పాత్రలతో మెప్పించారు.


సాంకేతికవర్గం పనితీరు :

రత్నవేలు సిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ప్రతి ఫ్రేంలో మహేష్ చాలా అందంగా కనిపించాడు. అఫ్కోర్స్ మహేష్ అందం మరింత రెట్టింపు అయ్యింది. ట్రైన్ ఎపిసోడ్, కర్నూలు యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం కెమెరా వర్క్ బాగుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సాంగ్స్ వినడానికన్నా విజువల్ గా బాగా వచ్చాయి. సూర్యుడివో చంద్రుడివో సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇక మైండ్ బ్లాంక్ సాంగ్ మహేష్ నిజంగానే మైండ్ బ్లాంక్ చేశాడు. బిజిఎం కూడా బాగా ఇచ్చాడు. కథ రొటీన్ గా అనిపించినా కథనంలో మార్కులు కొట్టేశాడు అనీల్ రావిపుడి. మహేష్ లాంటి స్టార్ తో సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :

మహేష్ బాబు,విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్,కెమెరా వర్క్,మ్యూజిక్,కామెడీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అవడం,కథ కొత్తగా లేకపోవడం


చివరగా :

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ ఫ్యాన్స్ కు పండుగ తెచ్చిన సినిమా..!


రేటింగ్ : 3/5

గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్స్:Phars Film Co. LLC

Back to Top