మస్కట్ : మవాలీ లో భారీ వర్షాలు...18 మందిని రక్షించిన రెస్క్యూ టీం
- January 16, 2020
మస్కట్ గవర్నరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సౌత్, నార్త్ అల్ బాటినా గవర్నరేట్స్, ముసందం, బిడ్బిడ్, సుర్ డివిజన్లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వరద నీరు చేరుకోవటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షాల కారణంగా చాలా డివిజన్లలోని టెంపరేచర్లలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్ జబర్, అల్ అక్ధర్ ప్రాంతాల్లో కనిష్టంగా 1 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కుగా టెంపరేచర్ ఉంది. జబల్ షమ్స్ పరిధిలో 2 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలాఉంటే సీబ్ డివిజన్ పరిధిలోని మవాలీ లో భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీటమునిగాయి. రెస్క్యూ టీమ్స్ 18 మందిని రక్షించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!