ఫైర్‌ వుడ్‌ అక్రమ విక్రయం:ఒకరి అరెస్ట్‌

ఫైర్‌ వుడ్‌ అక్రమ విక్రయం:ఒకరి అరెస్ట్‌

మస్కట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ (ఎంఇసిఎ), అక్రమంగా ఫైర్‌వుడ్‌ని విక్రయిస్తున్నందుకుగాను ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. సౌత్‌ షర్కియా గవర్నరేట్‌లోగల విలాయత్‌ ఆఫ్‌ అల్‌ కామిలి వాల్‌ వాఫిలో నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అతని నుంచి పెద్దయెత్తున ఫైర్‌వుడ్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత ఆరు నెలలుగా మినిస్ట్రీ పలు ఇల్లీగల్‌ లాంగింగ్‌ ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. ఎన్విరాన్‌మెంటల్‌ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మినిస్ట్రీ ఈ సందర్భంగా సూచించింది.

Back to Top